Native Async

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక ప్రకటనః ఆపరేషన్‌ సింధూర్‌లో 12 పాక్‌ విమానాలు కూల్చివేత

India’s Operation Sindoor IAF Destroys 12 Pakistani Jets Including F-16s and JF-17s After Pahalgam Terror Attack
Spread the love

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక ప్రకటన చేవారు. ఈ ఏడాది మే నెలలో భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సింధూర్‌లో ఎయిర్‌ఫోర్స్‌ పాకిస్తాన్‌కు చెందిన 12 యుద్ధ విమానాలను కూల్చివేసినట్టుగా ప్రకటించారు. కూల్చివేసిన 12 యుద్దవిమానాల్లో అత్యాధునికి ఎఫ్‌ 16, జెఎఫ్‌ 17 విమానాలు కూడా ఉన్నట్టు ఆయన తెలియజేశారు.

పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరులను తమ మతాన్ని అడిగి మరీ చంపేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్‌ ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ప్రకటించిన తరువాత అత్యంత రహస్యంగా ఆపరేషన్‌ సింధూర్‌ను ఆపరేట్‌ చేసింది. ఈ దాడిలో మహిళా ఎయిర్‌ఫోర్స్‌ అధికారిణిలు నేతృత్వం వహించడం విశేషం. నాలుగురోజులపాటు ఆపరేషన్‌ సింధూర్‌ను కొనసాగించగా, ఈ దాడిలో తొమ్మిది పాక్‌ ఉగ్రవాద శిబిరాలు, పాక్‌ సైన్యానికి చెందిన రాడార్‌ కేంద్రాలు, కమాండ్‌ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్‌ కేంద్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌ను మరికొన్ని రోజులు జరిపితే పాక్‌ కకావికలం అయ్యే అవకాశం ఉందని, తమ లక్ష్యం ఉగ్రవాద శిభిరాలే అని చెప్పి భారత్‌ ఈ ఆపరేషన్‌ను అక్కడితే నిలిపివేసింది.

అయితే, ఆపరేషన్‌ సింధూర్‌ను కేవలం తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశామని, కానీ, మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే ఆపరేషన్‌ సింధూర్‌ 2 కూడా ఉంటుందని భారత్‌ హెచ్చరించింది. ఆపరేషన్‌ సింధూర్‌ 2 ఉండాలా లేదా అన్నది పాకిస్తాన్‌ నిర్ణయించుకోవాలని తెలియజేసింది. అయితే, ఈ ఆపరేషన్ తరువాత పాకిస్తాన్‌ అగ్రదేశంగా చలామణి అవుతున్న అమెరికాతో చెలిమి చేయడం, ఆ దేశం కూడా భారత్‌పై సుంకాలు విధిస్తూ పాకిస్తాన్‌ను అక్కున చేర్చుకోవడంతో పాక్‌ భారత్‌ మధ్య ఎప్పటికైనా వైరం తీవ్రస్థాయిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నది అంతర్జాతీయ నిపుణుల అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit