ఈరోజు పుట్టపర్తి లో శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి… ఈ కార్యక్రమానికి AP CM చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, PM మోడీ, సచిన్ టెండూల్కర్ ఇంకా ఐశ్వర్య రాయి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు శ్రీ సత్య సాయి బాబా సేవలను వారందరు కొనియాడారు…
అలాగే చిరంజీవి కూడా సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలు సందర్బంగా అయన సేవలను ట్విట్టర్ ద్వారా కొనియాడారు…
“మానవ సేవయే – మాధవ సేవ” అనే స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన
భగవాన్ “శ్రీ సత్యసాయి బాబా” శత జయంతి వేడుకలు జరగడం చాలా ఆనందదాయకం. ప్రపంచానికి ఆధ్యాత్మికతను, సేవాభావాన్ని పెంపొందించి, సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన తలపెట్టిన కార్యక్రమాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన మన మధ్య వ్యక్తిగతంగా లేకపోవచ్చు, కానీ ఆయన స్ఫూర్తి మనందరికీ మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. బాబా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.100 స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపు జారీ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు. #100YearsofSriSathyaSai”.