ఆర్‌ఎస్‌ఎస్ శాఖపై దాడి ఘటనపై విజయనగరంలో ఏబీవీపీ–బీజేపీ నిరసనలు

ABVP and BJP Protest in Vizianagaram Over Attack on RSS Shakha at Andhra University
  • ఆర్.ఎస్.ఎస్ శాఖ పై దాడి చేయ‌డం త‌గ‌దు
  • రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌ను అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యం
  • క‌మ్యూనిస్ట్ ల క‌ట్ర‌లో భాగంగా ఏయూ ఘ‌ట‌న‌
  • విజ‌య‌న‌గ‌రంలో ఏబీవీవీ,బీజేపీల నిర‌స‌న గళం

రాష్ట్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము ప‌ర్య‌ట‌ను అడ్డుకునేందుకే విశాఖ ఏయూలో జ‌రిగిన దాడికి కార‌ణ‌మ‌ని హిందుత్వ సంఘాలు పేర్కొన్నాయి.గ‌డ‌చిన ముప్పై ఏళ్లుగా విశాఖ ఆంద్ర‌యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న ఆర్.ఎస్.ఎస్ శాఖ పై ఎస్.ఎఫ్.ఐ, దాడి చేయ‌డం హేమ‌యైన చ‌ర్య అని ఏబీవీపీ,బీజేపీలు తీవ్రంగా ఆరోపించాయి. ఏయూ దాడిని ఖండిస్తూ విజ‌య‌న‌గ‌రం కోట వ‌ద్ద దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేసారు ఏబీవీపీ.

ఈ మేర‌కు కోట జంక్ష‌న్ వ‌ద్ద గంట సేపు ధ‌ర్నా చేసారు. దాడి వెన‌క క‌మ్యూనిస్ట్‌ల కుట్ర ఉంద‌న్నారు.ప్ర‌శాంతంగా స‌మాజ హితం కోరుతూ సంఘ‌టిత‌మే ఐక్య‌త‌కు సంకేత‌మ‌ని, స‌మైక్య‌తే విజ‌యానికి మూల‌మ‌నే సిద్దాంతంతో వందేళ్ల క్రితం స్థాపించ‌బ‌డిన ఆర్.ఎస్.ఎస్ జ‌రుపుతున్న కృషిని స‌హించ‌లేక నే ఇలాంటి దాడుల‌కు దిగుతున్నారంటూ నిర‌స‌న‌కు ముఖ్య అతిదిగా హాజ‌రైన బీజేపీ విజ‌య‌న‌గ‌రరం జిల్లా అధ్య‌క్షుడు రాజేష్ వ‌ర్మ అన్నారు. ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా,దిక్సూచి గానూ దూసుకెళుతున్న భార‌త ఆర్దిక స్థితిని త‌ట్టుకోలేని క‌మ్యూనిస్ట్ ల కుట్ర ఫ‌లిత‌మే ఆ దాడుల‌న్నారు.వ‌సుదైక కుటుంబం…ఏకాత్మ‌తే ధ్యేయం అంటూ ముందుకెళుతున్న ఈ దేశంలో క‌మ్యూనిజం అంత‌రించే దిశ‌లో ఉంద‌న్నారు.

హింస‌కు తావు ఇవ్వ‌క‌,ప్ర‌శాంత‌కు పేరుగాంచిన ఉత్త‌రాంద్ర‌లో అదీ వందల ఏళ్ల చ‌రిత్ర ఉన్న విశాఖ యూనివ‌ర్సిటీలో దాడుల‌కు పాల్ప‌డ‌టం దారుణ‌మ‌న్నారు.కార్య‌క్ర‌మంలోనే ఏబీవీపీ నేత ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ క‌మ్యూనిస్ట్ ల భావ జాలమైన ఎస్.ఎఫ్.ఐ దాడులు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. అదీ దేశ ప్ర‌ధ‌మ పౌరురాలు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డానికే క‌మ్యూనిస్ట‌ల కుట్ర అని విమ‌ర్శించింది. కాగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా వ‌న్ టౌన్ నుంచీ కానిస్టేబుళ్లు రామ‌చంద్ర‌రావు,నాగరాజుల బందోబ‌స్త్ గా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *