తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళం ప్రాంతానికి చెందిన ఆమె, కళాశాల బయట ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్‌లో నివసిస్తోంది.
హాస్టల్ గదిలో ఉరివేసుకున్న స్థితిలో ఆమెను గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే సమాచారాన్ని నిర్వాహకులకు అందించారు. అనంతరం ఆమెను అత్యవసరంగా నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు మరియు ఇతర కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
మోహన్ బాబు యూనివర్సిటీ లో ఒక యువతి ఆత్మహత్య…