నాగ చైతన్య తన కెరీర్‌లోనే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆయన పూర్తిగా కొత్త లుక్‌లో, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తదుపరి చిత్రం వృషకర్మ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్నారు కాబట్టే ఇంకా ఎక్సపెక్టషన్స్ భారీగా ఉన్నాయ్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఈరోజే రిలీజ్ చేసిన గ్లింప్సె కూడా మంచి హైప్ పెంచింది సినిమా పైన!
ఈ గ్లింప్స్ స్టార్టింగ్ ఒక భయానకమైన సన్నివేశంతో మొదలవుతుంది. విలన్ ఒక విచిత్రమైన చిత్రాన్ని గీస్తాడు. ఆ చిత్రం గీసిన కొద్ది సేపటికే అది నిజ జీవితంలో జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. విలన్ నోట్లో నుంచి ఒక గబ్బిలం వచ్చి ఒక మనిషి మీద దాడి చేసి చంపేస్తుంది.
ఈ సమయంలో ఒక పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. “ప్రపంచ సృష్టి సమతుల్యతను అతీంద్రియ శక్తులు భంగం చేస్తే, ఆ సమతుల్యతను కాపాడటానికి విధి ఒక యోధుడిని ఎంచుకుంటుంది. అతడే వృషకర్మ” అని ఆ వాయిస్ చెబుతుంది. ఈ డైలాగ్‌తో కథలో ఒక మిస్టికల్ టోన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఐతే నెక్స్ట్ నాగ చైతన్య ఇంట్రడ్యూస్ అయ్యాక… ఒక రాజ్యం… ఆ రాజ్యం లో కూడా జరిగే అరాచకాలకు, ఈ యోధుడు ఎలా అడ్డు నిలిచాడు అన్నదే కథ… అక్కడ హీరోయిన్ మీనాక్షి రాణి లా కనిపిస్తుంది!
దర్శకుడు కార్తిక్ దండు ఈ గ్లింప్స్‌ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కథను ఇంత విభిన్నంగా చెప్పవచ్చా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఆయన విజువల్స్‌ను రూపొందించారు. విరూపాక్షలో చూపించిన తన మిస్టికల్ థ్రిల్లర్ స్టైల్‌ను ఈ సినిమాలో మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో చూడని ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్రయత్నించినట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.