Kailash Mansarovar Mystery
హిమాలయ పర్వతాల్లో మహాశివుడు కైలాస పర్వతం రూపంలో కొలువై ఉంటాడనే సంగతి తెలిసిందే. అందుకే మానస సరోవర యాత్ర అత్యంత పవిత్రమైనది చెప్పబడింది. కైలాస సరోవరం యాత్ర చేసిన వారు పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం కైలాసంలోని మహాశివుడిని పూజిస్తే ఏడు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని పురాణ ఉవాచ. కైలాస పర్వతాన్ని ప్రకృతి స్వయంగా సృష్టించిన శివుని రూపంగా భావిస్తారు. కైలాస మానస సరోవర యాత్రను మోక్షానికి మార్గంగా భావిస్తారు.
బ్రిటీషర్లను గడగడలాడించిన శివలింగం…ఆలయంలోని జ్యోతిని ఆర్పాలని ప్రయత్నిస్తే
ఈ ప్రయాణంలోనే మానస సరోవరం అనే సరస్సు కూడా వస్తుంది. ఈ సరస్సు బ్రహ్మదేవునికి సంబంధించినదిగా నమ్ముతారు. ఈ సరస్సు బ్రహ్మదేవుని మనస్సు నుంచి పుట్టిందని విశ్వాసం. అందుకే దీనిని మానస సరోవరం అని పిలుస్తారు. ఈ సరస్సులోని నీరు అత్యంత పవిత్రం. ఇక్కడ సరస్సులో స్నానం, ఇక్కడ చేసే తపస్సుకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నీరుని అమృతం లాంటిదని, దీని స్నానం చేయడం అత్యంత పవిత్రమైనదని, నీరును తాగడం ద్వారా పాపాలు నశిస్తాయని చెబుతారు. ఇక మహాశివుని అనుగ్రహంతో ఈ సరస్సు నీటిమట్టం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని, కఠినమైన శీతాకాలంలో కూడా ఈ మానస సరోవరంలో మంచు గడ్డకట్టదు. అదే సమయంలో మానస సరోవరానికి సమీపంలోనే రాక్షసి తల అనే మరో సరస్సు కూడా ఉంటుంది. ఈ రాక్షసి తల సరస్సులోని నీరు గడ్డకడుతుంది. ఇది దేవుడి మహిమ కాకపోతే మరేంటి.