బ్రిటీషర్లను గడగడలాడించిన శివలింగం…ఆలయంలోని జ్యోతిని ఆర్పాలని ప్రయత్నిస్తే

Srikalahasti Shiva Lingam That Terrified British Officers

పంచభూత లింగాల్లో వాయులింగానికి ప్రత్యేకత ఉంది.  వాయులింగాన్నే శ్రీకాళహస్తీశ్వర శివలింగం అని కూడా పిలుస్తారు.  కాళహస్తీశ్వర క్షేత్రం వాయువుకు ప్రతీక.  ఆలయం గర్బగుడిలో ఈ జ్యోతి ఎల్లప్పుడూ కదులుతూ ఉంటుంది.  మరో జ్యోతి కదలకుండా నిశ్చలంగా ఉంటుంది.  మహాశివుడు ఎదురుగా ఉన్న జ్యోతి మాత్రమే కదులుతూ ఉండటం విశేషం.  ఇక్కడ స్వామివారు శ్వాసిస్తున్నాడని చెప్పడానికి ఇది ప్రతీక.  అయితే, వెలుగుతున్న ఈ జ్యోతులను ఆర్పివేయడానికి ఆనాటి బ్రిటీష్‌ దొరలు ఎంతగానో ప్రయత్నించారు. 

తమ అధికార బలంతో ఆలయం తలుపులు మూయించారు.  తలుపులు మూసివేస్తే ఆక్సీజన్‌ లేక జ్యోతి ఆరిపోతుందని భావించారు.  వాటిని పరీక్షించిన బ్రిటీష్‌ అధికారుల శరీర భాగాలు క్రమంగా ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోవడం ప్రారంభించాయి.  శరీరంలో వేడి తగ్గుతూ ఊపిరి అందడం కూడా కష్టంగా మారిపోయింది.   చివరికి చనిపోయే స్థితికి చేరుకోవడంతో స్వామి మహిమ వలనే ఇలా జరిగిందని గుర్తించి తప్పు తెలుసుకొని వెంటనే ఆలయం తలుపులు తెరిపించారు.  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మరణించే స్థితికి చేరుకున్న అధికారులను ఆలయంలోపలికి తీసుకెళ్లగా..కాసేపటికి కోలుకున్నట్టుగా ఆలయ చరిత్ర చెబుతున్నది.  స్వామివారు వాయువు రూపంలో ఇక్కడ సజీవంగా ఉన్నాడు అని చెప్పడానికి ఇదోక నిదర్శనం.  

Also Read  మాఘమాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది…మాఘమాసం విశిష్టత ఇదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *