దిగొచ్చిన కార్లు…రోడ్లు బిజీ కానున్నాయా?

జీఎస్టీలో మార్పులు చేసిన తరువాత ధరల్లో హెచ్చుతగ్గులు కానున్న సంగతి తెలిసిందే. ప్రీమియం వస్తువులు మినహా మిగతా వాటిపై ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే కార్లు తమ ధరలను తగ్గిస్తూ కొత్త ధరలను ప్రకటించాయి.

ఈ విభాగంలో టాటా కంపెనీ ముందు వరసలో ఉండగా… ఇప్పుడు ఈ వరసలో మహీంద్రా, రెనాల్ట్ కూడా చేరిపోయాయి. ఇప్పటికే టాటా ఏయే మోడల్ పై ఎంతెంత ధరలు తగ్గించారో ప్రకటించగా, తాజాగా ఈ రెండు కార్ల కంపెనీలు కూడా తగ్గించిన ధరలను ప్రకటించాయి.

ఇప్పటికే రోడ్లపై బైకులతో సమానంగా కార్లు పరుగులు తీస్తున్నాయి. ధరలు తగ్గించిన తరువాత మరింత సంఖ్యలో కార్లు రోడ్డెక్కన్నాయి. ప్రీమియం కార్లు మినహా మిగిలిన కార్లపై సుమారు 70 వేల నుంచి లక్షా 50 వేల వరకు ధరలు తగ్గించినట్టు ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *