విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.
Related Posts
కాళ్లు పనిచేయకున్నా 75 ఏళ్ల వయసులో అలుపెరుగని పోరాటం
సౌకర్యం, విశ్రాంతి కోరుకునే వయస్సులో… బాధ్యతను భుజాన వేసుకున్న వ్యక్తి ఎన్.ఎస్. రాజప్పన్. 75 ఏళ్ల వయసులోనూ ఆయన జీవితం ఒక నిశ్శబ్ద పోరాటం. కేరళలోని వెంబనాడ్…
సౌకర్యం, విశ్రాంతి కోరుకునే వయస్సులో… బాధ్యతను భుజాన వేసుకున్న వ్యక్తి ఎన్.ఎస్. రాజప్పన్. 75 ఏళ్ల వయసులోనూ ఆయన జీవితం ఒక నిశ్శబ్ద పోరాటం. కేరళలోని వెంబనాడ్…
పంచాంగం – ఈరోజు శుభముహూర్తాలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం,శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష అష్టమి తిథి ఉ.11.09 వరకూ తదుపరి నవమి తిథి, పునర్వసు నక్షత్రం ప.11.54…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం,శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష అష్టమి తిథి ఉ.11.09 వరకూ తదుపరి నవమి తిథి, పునర్వసు నక్షత్రం ప.11.54…
ఆగస్టు 21నుంచి 16 రోజులపాటు శ్వేతార్కగణపతి ఉత్సవాలు
కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు. ఇందులో దేవాలయ…
కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు. ఇందులో దేవాలయ…