నిన్నటి నుంచి మన crushmika రష్మిక మందన్న పేరే ట్రేండింగ్ లో ఉంది… నిన్ననే తన బాయ్ ఫ్రెండ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ అయ్యింది అని న్యూస్ తెగ వినిపిస్తుంది. అలానే పెళ్లి కూడా వచ్చే ఫిబ్రవరి లో ఉంటుందంట…
ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడే రష్మిక లేటెస్ట్ సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్… నిర్మాతలు ఒక చిన్న ప్రోమో వదిలి, రిలీజ్ డేట్ ని కంఫర్మ్ చేసేసారు…
ఈ ప్రోమో లో ఇటు రష్మిక అటు దీక్షిత్ శెట్టి ఒక రెస్టారంట్ లో ఉండగా, రష్మిక కి అసలు లవర్స్ లో ఒకరికి ఒకరు పర్ఫెక్ట్ అని ఎలా తెలుస్తుందని అడుగుతుంది… అలాగే రిలీజ్ డేట్ కూడా 7th నవంబర్ అని అనౌన్స్ చేస్తుంది…