ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా, భాజభజంత్రీల నడుమ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి వెంకటరావు స్వహస్తాలతో ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. ఆలయం బయటే ఆలయ అదికారులు ఏర్పాటు చేసిన ఉయ్యాల చుట్టూ ముమ్మారు ప్రదిక్షణలు చేసారు. అనంతపురం శ్రీశ్రీ శ్రీ పైడితల్లిని ఉయ్యాల లో కూర్చోబెట్టి… కాస్సేపు ఉయ్యాలను ఊపారు. ఈ కార్యక్రమం మొత్తం దేవాలయ ఆలయ ఈఓ శిరీష ఆధ్వర్యంలో జరుగగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ పోలీసులు, ఎస్టీఎఫ్ లు బందోబస్త్ నిర్వహించారు.కార్యక్రమానికి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Related Posts
మోదీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి?
భారత ప్రధాని నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ఒక్కరోజులో జరగలేదు. ఆయన చేసిన నాయకత్వ పద్ధతి, తీసుకున్న నిర్ణయాలు, దౌత్య విధానం, అభివృద్ధి దృక్పథం వల్లే ఆయనకు…
భారత ప్రధాని నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ఒక్కరోజులో జరగలేదు. ఆయన చేసిన నాయకత్వ పద్ధతి, తీసుకున్న నిర్ణయాలు, దౌత్య విధానం, అభివృద్ధి దృక్పథం వల్లే ఆయనకు…
కాంతారా ఇష్యూ పైన స్పందించిన రిషబ్ శెట్టి…
గత నెల గోవాలో జరిగిన IFFI ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. అయితే…
గత నెల గోవాలో జరిగిన IFFI ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. అయితే…
చొల్లంగి అమావాస్యరోజున… డా. హరగోపాల్ ఆధ్వర్యంలో విశాఖలో సముద్ర స్నానం
నిర్ణీత సమయంలోపు, సకాలానికి క్రమ తప్పకుండా భోజనం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని తన మాటలు నిరూపితం చేసిన, చేసుకొని ఆరోగ్యం గా ఉన్న…
నిర్ణీత సమయంలోపు, సకాలానికి క్రమ తప్పకుండా భోజనం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని తన మాటలు నిరూపితం చేసిన, చేసుకొని ఆరోగ్యం గా ఉన్న…