ఈ మధ్య వచ్చిన పాటల్లో అందరికి నచ్చినవి రెండే రెండు… అవి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోని “మీసాల పిల్ల…” ఇంకోటి చరణ్ ‘పెద్ది’ సినిమాలోని “చికిరి చికిరి…”. ఈ రెండు పాటలు ఇప్పటికి తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఐతే యూట్యూబ్ లో ఈ సాంగ్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని మెగా ఫాన్స్ కూడా పోటీ పడుతున్నారు. ఈ మధ్యే మన హనుమాన్ చాలీసా కి 500 కోట్ల వ్యూస్ వచ్చాయి… అందుకే మన తెలుగు సాంగ్స్ అంటే అందరికి ఇష్టం!
ఐతే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఐతే, మీసాల పిల్ల సాంగ్ 70M వ్యూస్ దాటేసింది. ఈ పెద్ద న్యూస్ ని శంకర వార ప్రసాద్ టీం సోషల్ మీడియా లో షేర్ చేసి మెగా ఫాన్స్ ని ఖుష్ చేసారు…
మన శంకర వార ప్రసాద్ గారు సినిమా లో నయనతార హీరోయిన్ ఐతే విక్టరీ వెంకటేష్ ఒక మంచి రోల్ లో నటిస్తున్నాడు. అలాగే కాథరిన్ ట్రెసా కూడా ఒక మంచి రోల్ లో కనిపించనుంది…
ఈ సినిమా మన సంక్రాతి పండగ సందర్బంగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది… ఇక ఈరోజో రేపో గట్టి ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి…