Shikha Secret in Hindu Dharma
పూర్వం రోజుల్లో హైందవులు అని చెప్పేందుకు శిఖను తప్పనిసరిగా పెట్టుకునేవారు. వర్ణాలను అనుసరించి శిఖలు ఉండేవి. తల వెనుక భాగంలో మ్రోకుట భాగానికి దగ్గరగా ఉంటే జుట్టును శిఖ అంటారు. ఇది పొడవుగా ఉంటుంది. శిఖ పెట్టుకునే విధానం అనుసరించి వర్ణాలను గుర్తించేవారు వేదకాలంలో. శిఖ ఉండటానికి పలు కారణాలున్నాయి. శిరస్సుపైన బ్రహ్మరంధ్రం అనే సూక్ష్మమైన బిందువు ఉంటుంది. ఇది జీవాత్మ, పరమాత్మకు సంబంధించిన కేంద్రస్థానం. ఆ స్థానాన్ని రక్షించేందుకు శిఖను పెట్టుకుంటారు. శిఖ ఉన్నవారు చతుర్వర్ణాల్లో ఎవరైనా సరే గాయత్రిని ఉపాసించవచ్చు.
Also Read: పూర్వం ఇలానే చేసేవారు…తులసికి నీళ్లతో పాలను
అయితే సంధ్యావందనం వంటి ప్రక్రియలను కొన్ని వర్ణాల వారు మాత్రమే చేయవలసి ఉంటుంది. ప్రత్యేకమైన శిఖలు ఉన్నవారికి గాయత్రి జపం, సంధ్యావందనం వంటి కర్మలను చేయడానికి యోగ్యులవుతారు. శాస్త్రీయపరంగా చూస్తే తల వెనుకభాగంలో సుశుమ్న నాడికి శిఖ ఉంచడం వలన చల్లదనాన్ని ఇస్తుంది. అధికవేడి నుంచి రక్షణ పొందవచ్చు. యోగశాస్త్రపరంగా చూసుకుంటే కుండలిని శక్తిని నియంత్రించేందుకు శిఖ సహాయపడుతుంది. శిఖ ఉన్నవారు ధార్మిక కర్మల పట్ల విధేయత చూపే వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఇది వేదాద్యయనం, వేదసంబంధిత సేవలకు ప్రామాణికతను సూచిస్తుంది. శిఖలేకపోతే బ్రహ్మరంధ్రం సక్రియంగా ఉండదు. జీవశక్తి ప్రవాహం సంపూర్ణంగా జరగదు. మనోబలం లోపిస్తుంది. పరమాత్మతో సంబంధం కోల్పోవడం జరుగుతుంది.