మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా చిత్రం “పెద్ది”. పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మోస్ట్ అవేటెడ్ టోటల్ ఆల్బమ్ ‘పెద్ది జ్యూక్ బాక్స్’ ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ ఈ ఆల్బమ్ అందుబాటులోకి వచ్చింది.
అయితే, ఈ ఆల్బమ్ విడుదలైన తర్వాత మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారనే చెప్పాలి. థియేటర్లలో సుమారు 3 గంటల పాటు అలరించబోతున్న ఈ సుదీర్ఘమైన సినిమాలో కేవలం 4 పాటలు మాత్రమే ఉండడం గమనార్హం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడంతో, ఆయన మార్క్ మ్యాజిక్ తో కూడిన మరికొన్ని కొత్త పాటలు ఆల్బమ్ లో ఉంటాయని అభిమానులు ఆశించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్ సాంగ్ ‘మస్సా మస్సా’ కోసం చాలామంది ఎదురుచూశారు.
సాధారణంగా బుచ్చిబాబు సినిమాల్లో మ్యూజిక్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ, ఇందులో కేవలం నాలుగు పాటలకే పరిమితం చేయడంతో, “పెద్ది… ఇవే ఫైనల్, అంతకు మించి లేవు” అని రెహమాన్ తేల్చేసినట్లయింది. కేవలం పాటల సంఖ్య పరంగా మ్యూజిక్ లవర్స్ ను డిజప్పాయింట్ చేసినప్పటికీ, ఉన్న నాలుగు పాటలు మాత్రం సినిమా కథా గమనానికి తగ్గట్టుగా చాలా పవర్‌ఫుల్‌గా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కోట్లాది మంది మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!